బ్రహోత్సవాల వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
వెబ్ న్యూస్, బతుకమ్మ: ఏపీలోని ఒంటిమిట్ట కోదండ శ్రీరామాలయంలో ఆదివారం మహాసంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఉదయం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీ మద్రామాయణ హోమం, పంచసూక్త – పవమాన హోమములను అర్చకులు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10.15 నుంచి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చనను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను బీఆర్ నాయుడు, నాయకులు ఆవిష్కరించారు. ఏప్రిల్ 5 నుంచి 15 వరకు ఒంటిమిట్ట కోదండ శ్రీరామాలయ బ్రహోత్సవాలు జరగనున్నాయి.
