ఒంటిమిట్ట కోదండ శ్రీరామాలయంలో వైభవంగా మహాసంప్రోక్షణ
బ్రహోత్సవాల వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెబ్ న్యూస్, బతుకమ్మ: ఏపీలోని ఒంటిమిట్ట కోదండ శ్రీరామాలయంలో ఆదివారం మహాసంప్రోక్షణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పాల్గొన్నారు. ఉదయం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీ మద్రామాయణ హోమం, పంచసూక్త - పవమాన హోమములను అర్చకులు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10.15 నుంచి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకము, స్వర్ణ...