28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా మద్దుల్ జాతర

Must read

📰 Generate e-Paper Clip

పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి

ధర్పల్లి, బతుకమ్మ : కోరిన వారికి కొంగు బంగారమైన శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర  శనివారం ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ సంవత్సరం స్వామి వారికి కళ్యాణ వేడుకలు నిర్వహించగా ఈ వేడుకల్లో భక్తులతో పాటు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ… అత్యంత పురాతనమైన మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని,తను దేవుని ఆశీర్వాదంతో ఎలక్షన్ ప్రచారం ప్రారంభించానని ప్రజల ఆదరణతో దేవుని కృపతో గెలిచానని అన్నారు. ఆలయ  పునర్నిర్మాణానికి గతంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఐదు లక్షల రూపాయల తన సొంత డబ్బులను చందా ఇవ్వడం జరిగిందని అలాగే తాను కూడా యాభై ఒక్క వేల రూపాయల చందా ఇస్తానని,ఇంకా ఎండోమెంట్ ద్వారా మరింత సహాయానికి ప్రయత్నం చేస్తానని,ఆలయ పునర్నిర్మాణానికి అటవీ శాఖ నుండి అవసరమైన అనుమతులు ఇప్పిస్తానని అన్నారు.అనంతరం నడిమి తండాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి వారి మందిరాన్ని,నవ గ్రహాలను సందర్శించారు.తండా వాసులు ఆంజనేయ ఆలయాన్ని నిర్మించడం అభినందనీయం అని అన్నారు.ప్రాజెక్ట్ రామడుగు నుండి వర్షాకాలం పంటకు నీటిని విడుదల చేసి,పంటలు బాగా పండాలని,రైతులందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతున్ని వేడుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ….. ప్రతీ సంవత్సరం శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆలయంలో ఉదయం నుండే పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభం కాగా ధర్పల్లి గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన సత్రం నిర్వహించగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రూరల్ భూపతి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్,లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ నాయకులు చెలిమెల శ్రీనివాస్, చెలిమెల నర్సయ్య,మిట్టపల్లి గంగారెడ్డి,నడిమి తండా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Magnificent Maddul fair

More articles

Latest article