23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

వైభవంగా ఎడ్లబండ్ల ప్రదర్శన

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట, బతుకమ్మ :

 

లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామదేవతల ఆలయాల వద్ద ఎడ్లబండ్ల ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. గ్రామదేవతలకు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం బూర్గుల పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయాల వద్ద బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో స్థానికులు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డివిటి రమేష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article