వైభవంగా ఎడ్లబండ్ల ప్రదర్శన
లింగంపేట, బతుకమ్మ : లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామదేవతల ఆలయాల వద్ద ఎడ్లబండ్ల ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. గ్రామదేవతలకు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం బూర్గుల పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయాల వద్ద బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో స్థానికులు పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డివిటి రమేష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.