కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్
నిజామాబాద్, బతుకమ్మ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ లోని విద్యానగర్, మార్క్స్ భవన్ లో శనివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎం.సుధాకర్ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆఫీస్ బేరర్లుగా ఉమ్మడి జిల్లా నుండి బి.ఈశ్వరి, శశికళ, హేమలత, రాష్ట్ర కమిటీ సభ్యులుగా సుమలత, సునీత ఎన్నికయ్యారన్నారు. ఈ సందర్భంగా...