. . . లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ తో ఒక దానిని మరోక్కటి గా ఢీ కొట్టిన 7 కార్లు
ఇందల్ వాయి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై ఒక లారీ భీభత్సం సృష్టించింది. సోమవారం ఇందల్ వాయి మండలం చంద్రాయన్ పల్లి లో లారీ భీభత్సం రేపింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న లారీ నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఒకదాని కొకటిగా పలు వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. లారీని వెనుక నుంచి ఢీకొట్టిన పలు కార్లు ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జయ్యాయి. మొత్తం 7 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఒక లారీ అదుపు తప్పి బోల్తా కోట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని హుటా హుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. కార్లలో బెలున్ లు తెరుచుకోవడంతో పాటు కార్లు ఒకదాని వేనుక నుంచి మరోకటి ఢీ కొట్టడంతో ప్రమాదంలో కార్లు ధ్వంసం ఐన ప్రాణ నష్టం సంభవించలేదు. ఇందల్ వాయి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ జాం కాకుండా వాహనాలను దారి మళ్లించారు.
