. . . తల్లి మృతి . . . కొడుకు కు గాయాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగర శివారులోని అశోక్ సాగర్ చెరువు కట్ట వద్ద లారీ, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా కొడుకు కు గాయాలయ్యాయి. ఆరవ టౌన్ ఎస్ఐ సందీప్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం ఉదయం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన మార అవిక్షిత్ తన తల్లి కమలతో పాటు అతని యొక్క పల్సర్ మోటార్ సైకిల్ పై జానకంపేట నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో అశోక్ సాగర్ చెరువు కట్ట పైకి రాగానే వారి వెనకాలే వస్తున్నా ఒక లారీ డ్రైవర్ వెనక నుండి ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ పల్సర్ హేండిల్ కి తగలగ పల్సర్ పై గల ఇద్దరు వ్యక్తులు కింద పడ్డారు. లారీ మహిళ పై నుండి వెళ్లడంతో అట్టి మహిళ తల పగిలి అక్కడికక్కడే చనిపోగా పల్సర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా అతనిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇట్టి సంఘటన పై మృతురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
