25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

భిక్కనూరు  వద్ద లారీ బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

. . .  పోలీసులపై దాడి యత్నించిన  లారీ డ్రైవర్లు 

. . .  అదుపులోకి తీసుకున్న పోలీసులు 

బతుకమ్మ భిక్కనూరు :

వాహనాల తనిఖీ చేపడుతున్న  పోలీసులను తప్పించుకొని అతివేగంగా వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు రోడ్డుపై బోల్తాపడగా  తమ లారీని ఎందుకు ఆపారని  పోలీస్ లపై దాడికి యత్నించిన సంఘటన భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అతివేగంతో వెళ్తున్న  లారీని పెట్రోలింగ్ సిబ్బంది  ఆపాలని కోరగా అతివేగంతో కట్లు కొడుతూ   ముందుకు సాగనిచ్చారు. సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడింది. అదే సమయంలో ఆ లారీ వెనకాల వస్తున్న మరికొన్ని ఆలుగడ్డ లారీల డ్రైవర్లు రోడ్డుకు అడ్డంగా లారీలను పెట్టి పోలీసులపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న మిగతా వాహనదారులు, స్థానికులు దాడికి యత్నించిన లారీ డ్రైవర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Lorry overturns near Bhikkhunur

More articles

Latest article