30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

హోరా హోరిగా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హోరా హోరిగా జరుగుతున్నాయి. అసోసియేషన్ ఎన్నికలు అదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ మున్నురుకాపు సంఘం కల్యాణ మండపం లో  జరిగే పోలింగ్ పక్రియ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు  సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరుగనుంది. రెండు ఫ్యానల్ లు రంగంలోకి దిగాయి హోరాహోరిగా తలపడుతున్నాయి. అసోసియేషన్ అధ్యక్ష పదవికి నల్ల మధుసూదన్, సత్య ప్రసాద్ లు పోటీ పడగా, జనరల్ సెక్రటరీ స్థానానికి బీర్కుర్ సుధాకర్, సంతోష్, పోటీలో నిలిచారు. కోశాధికారిగా మోర సాయిలు, కాపర్ రమేష్ తలపడుతున్నారు. నిజామాబాద్ కేమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ 1966 లో ఏర్పాటైంది. ప్రస్తుతం దాదాపు 1300 మంది సభ్యులు ఉన్నారు. నగరంలో పేరుమోసిన మెడికల్ ఏజెన్సీ లకు చెందిన యజమానులు  బరిలో నిలువడంతో  హోరా హోరిగా సాగుతున్నాయి. గతంలో ఎన్నికలలో పోటి చేసిన వారు బరిలో ఉండటంతో లక్షల ఖర్చు జరుగుతున్నాయని తెలిసింది.

Hora Horiga District Chemist and Druggist Association Elections

More articles

Latest article