సిద్దిపేట, బతుకమ్మ : చెక్ పోస్ట్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ జీప్ ను లారీ ఢీకొంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జిల్లెల గడ్డ చెక్ పోస్ట్ వద్ద శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి హుస్నాబాద్ వైపు చేపల లోడుతో వస్తున్న లారీ చెక్ పోస్ట్ వద్ద నిలిపి ఉంచిన పోలీస్ జీప్ ను ఢీ కొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. పోలీస్ జీప్ ను సుమారు 200 మీటర్ల వరకు లారీ లాక్కెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో జీప్ లో పోలీస్ సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లారీ డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి దారి తీసిన కారణాలను గుర్తించే యత్నం చేస్తున్నారు.
