27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సత్వర న్యాయానికి చిరునామా ‘లోక్ అదాలత్’

Must read

📰 Generate e-Paper Clip

  • కక్షిదారులను కలుపుకొని పోతాం
  • కేసులుంటే పక్కలో బాంబులున్నట్లే
  • 14న జాతీయ లోక్ అదాలత్
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయార్తులకు మెరుగైన న్యాయసేవలు అందించడానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ప్రణాళికబద్ధమైన కృషి చేస్తుందని సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్ భరత లక్ష్మీ తెలిపారు. శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ వివరాలను  జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్ లో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ దావాలు ఇరుపక్షాలు రాజీ చేసుకుని పరిష్కరించుకోవడానికి అసలుసిసలు చిరునామా లోక్ అదాలత్ అని అన్నారు. కుటుంబాలలోని ఎదుగుతున్న పిల్లలకు వివాదాలతో కూడిన కేసులను వారసత్వoగా ఇవ్వరాదని పేర్కొన్నారు.ఏ కేసులైన అవి పక్కలో బాంబులేనని ఆమె చమత్కరించారు. భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయస్థానలతో పాటు, ఆర్మూర్, బోధన్ కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.న్యాయ వివాదాలు ఎదుర్కొంటున్న కక్షిదారులందరిని కలుపుకుని జాతీయ లోక్ అదాలత్  అనే ఒక మహాయజ్ఞం చేస్తున్నామని ఫలితం కక్షిదారులదేనని జిల్లాజడ్జి అభివర్ణించారు.సివిల్, క్రిమినల్ కేసుల రాజీ పరిష్కారానికి లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జడ్జిలు బెంచ్ ప్రీసైడింగ్ అధికారులుగా, సీనియర్ న్యాయవాదులు సభ్యులుగా ఉంటారని రాజీ పడిన కేసులకు అవార్డులు జారీ చేస్తారని, అవార్డులు పై కోర్టులలో అప్పీలుకు వీలులేనివని, అంతిమమని జిల్లాజడ్జి తెలిపారు.

More articles

Latest article