25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పెంచిన బస్ పాస్ చార్జీలు వెంటనే తగ్గించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

 

నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని పిడిఎస్యూ  జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కోట గల్లి నీలం రామచంద్ర భవన్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిసి బస్ పాస్ చార్జీలు 1150 నుండి 1400 మెట్రో ఎక్స్ ప్రెస్ లో 1300 నుండి 1600 వరకు దాదాపు 20 శాతం పెంచారని తెలిపారు.  పెంపు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక భారం పడుతుందని, స్కూలు, కాలేజీలు ప్రారంభమవుతున్న సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని అన్నారు. ఒకవైపు ఫ్రీ బస్సు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ మరొకవైపు పేద విద్యార్థుల పైన వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు. వెంటనే పెంచిన బస్ పాస్ లను తగ్గించాలని డిమాండ్ చేశారు. 12 నుండి ప్రభుత్వ పాఠశాల ప్రారంభమవుతున్న దృష్ట మౌలిక సదుపాయాలు కల్పించాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పి డి ఎస్ యూ నాయకులు మనోజ్, నిఖిల్, ముక్తశ్రీ, దుర్గాప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article