. . . రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
. . . సర్పంచులు లోకాని గంగామణి, బాదావత్ సుదర్శన్ నాయక్
ఇందల్ వాయి, బతుకమ్మ :
ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్ వాయి, ఇందల్ వాయి తాండ గ్రామాలలో శుక్రవారం ఇందల్ వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందల్ వాయి సర్పంచ్ లోకాని గంగామణి గంగారం, ఇందల్ వాయి తండాలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బాదావత్ సుదర్శన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలలోకి తీసుకువచ్చి ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధరను పొందాలని రైతులకు సూచించారు. సన్నాలకు కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలు ఇస్తున్నందున రైతులు గమనించాలని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. వరి ధాన్యం గ్రేడ్ ఏ కు రూ.2389, కామన్ వరి ధాన్యానికి రూ.2369 చెల్లిస్తుందని రైతులకు తెలిపారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన వరి ధాన్యాన్ని వెను వెంటనే మ్యాచర్ ద్వారా చూసి తొందరగా మార్కెట్ యార్డుకు లారీలలో తరలించేటట్లు చూడాలని తెలిపారు. లారీల కొరత ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వరి ధాన్యాన్ని తరలించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, మాజీ ఎన్డిసిసిబి డైరెక్టర్ కోరాట్పల్లి ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, సీఈవో శ్రీకాంత్, కిషన్, రవి, మోతిలాల్ నాయక్, రఘుపతి, వసంత్ రావు, రవి, జగదీష్ రైతులు పాల్గొన్నారు.

