27.3 C
Hyderabad
Friday, July 31, 2026

స్థానికం ’ ఇప్పట్లో లేనట్టే

Must read

📰 Generate e-Paper Clip

  •  బీసీల కులగణన తర్వాతనే రిజర్వేషన్లు ఖరారు
  • పీసీసీ చీఫ్ పధవి బాధ్యతల సభలో సీఎం రేవంత్ రెడ్డి
     ఆశావహుల ఆశలపై నీళ్లు

బతుకమ్మ, నిజామాబాద్:  స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడేప్పుడు ప్రకటిస్తారా, పోటీ చేద్దామని ఆశ పెట్టుకున్న ఆశావహుల ఆశలపై రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్ట సభలలో రావాల్సిన రిజర్వేషన్ ల అంశంను తెలిపే కుల గణన ప్రక్రియ తరువాతనే ఎన్నికల నిర్వహణ అంటు కుండ బద్ధలు కొట్టారు. రాష్ర్టంలో బిసీ కమీషన్ ఏర్పాటు చేసి దానికి నిరంజన్ ను చైర్మెన్ చేశామని, ఇఫ్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ర్టఅధినేతగా మహేష్ కుమార్ గౌడ్ నియమాకం అందుకే అంటు ఆదివారం పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి..
ఈ ఏడాది పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాల కాల పరిమితి ముగిసింది. ఇప్పుడు అంతా ప్రత్యేక అధికారుల పాలనే. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాల మంది చోటా మోటా లీడర్లు లోకల్ బాడీ ఎలక్షన్ పై గంపేడాశలు పెట్టుకున్నారు. ఇటీవల స్థానిక సంస్థల అధిపతుల కాలపరిమితి ముగిసిన వేంటనే ప్రభుత్వం ఓటర్ల నమోదు, ముసాయిదా జాబితాల పనులను చక్కబెట్టింది. దానితో చాల మంది గ్రామ, మండల స్థాయి లీడర్లలో కొత్త అశలు చిగురించాయి. మరో ముడు నాలుగు నెలల్లో మున్సిపాల్టీలు, కార్పోరేషన్ ల పాలక వర్గాల పధవి కాలం కూడా ముగియనుంది. దానితో ముందుగా గ్రామీణ, మండల స్థాయిలోని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తారని తరువాత బల్ధియా ఎన్నికలు ఉంటాయని అందరు ఊహించారు. ఇప్పటికే గ్రామాలలో ఏకగ్రీవం కోసం పావులు కదుపుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇదివరకే రెండు గ్రామాలు ఏకగ్రీవానికి మొగ్గు చూపాయి. ఇంకా కొందరు ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారు. ప్రస్తుతం జరగుతున్న గణపతి నవరాత్రుల ఉత్సవాలలో కొందరు లీడర్లకు చేతి చమురు బాగానే వదిలింది. మరి కొంత మంది ఖద్ధరు కట్టాడానికి, మేయింటనేన్స్ ఇప్పటికే తడిసి మోపేడు అవుతుంది ఎన్నికల వాయిదా అంటే తాము భారం మోయలేమని అంటున్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో గ్రామీణ ప్రాంతాలలో ఓటర్ల జాబితాను అధికారులు ఇటీవల సిద్ధం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలో 8,29,463 మంది ఓటర్లుగా, కామారెడ్డి జిల్లాలో 6,36,300 మంది ఓటర్లతో తొలి ముసాయిదా జాబితా స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలో గ్రామాలలో, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల కాల పరిమితి ముగిసింది. ఇప్పుడు అంతా అక్కడ ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. అధికార కాంగ్రెస్ కు చెందిన మాజీల పెత్తనం సాగుతున్న చేతిలో పవర్ లేక వారు ఉత్సవ విగ్రహలుగా ఉన్నారు. ప్రభుత్వం ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయడంతో పాటు అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితాకు కసరత్తు జరగుతుంటే లోకల్ లీడర్ల స్థానిక ఎన్నికలపై ఎన్నో రంగుల కలలు కంటున్నారు. కానీ సీయం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వారి అంచనాలు అన్ని తలకిందులైనాయి.

More articles

Latest article