24.5 C
Hyderabad
Friday, July 31, 2026

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు

 

కామారెడ్డి, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కామారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు పిలుపునిచ్చారు. మహమ్మద్ నగర్ మండలంలో బిజెపి పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జడ్పిటిసి, సర్పంచ్ స్థానాలు గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.  ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు నీలం చిన్న రాజులు, జిల్లా కౌన్సిల్ మెంబర్ అనిల్ సెట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు లింగాల శంకర్ పటేల్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రాజు, వివిధ మోర్చాల అధ్యక్షులు పండరి, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు రాజు, రాజా గౌడ్, నారాయణ, వినయ్, వెంకట్ రెడ్డి, విటల్, కళ్యాణ్, మండల సీనియర్ నాయకులు ఉప్పల విటల్, రైతు రాజు, శీను, అశోక్, సాయిలు, పోచయ్య, రమేష్, మోహన్, గాలిపూర్ నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Local body elections should be the target of the work

More articles

Latest article