మోర్తాడ్, బతుకమ్మ:నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలోనీ కమ్మ సంఘం లో బుధవారం లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు 110 మంది ఆదర్శ రైతులను ఎంపిక చేయడం జరిగింది. మన మోర్తాడ్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతుగా తీగల రమేష్ రెడ్డిని ఎంపిక చేసి పంపడం జరిగింది. మంజీరా ఫంక్షన్ హాల్ కమ్మ సంఘం బోధనలో ముఖ్య అతిథి లయన్ ఘట్టమని బాబురావు, విశిష్ట అతిథులు లయన్ అమర్నాథ్ రావు లయన్, లయన్ బసవేశ్వర రావు, లయన్ సూర్య రాజ్, లయన్ నరసింహ రాజు, లయన్ జీ.రమేష్, లయన్ సిహెచ్ ప్రకాష్ రావు, లయన్ విజయలక్ష్మి, లయన్ మామిడాల మనోహర్, జిల్లా చైర్పర్సన్ హాజరైనారు. మోర్తాడ్ పట్టణానికి చెందిన తీగల రమేష్ రెడ్డి కి లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆదర్శ రైతుగా సన్మానం చేశారు.

