29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా కోటపాటి జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ప్రముఖ రైతు నాయకుడు గల్ఫ్ కార్మిక నేత ఆర్మూర్ వాసి కోటపాటి నరసింహం నాయుడు 66 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్మూర్ లోని వంశీ గ్యాస్ ఏజెన్సీస్ ప్రాంగణంలో బుధవారం జరిగిన కోటపాటి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కోటపాటి తన ప్రతి పుట్టినరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు గానే ఈ సంవత్సరం కూడా ఆర్మూర్ ప్రాంతంలోని యువకులను సమీకరించి పెద్ద ఎత్తున ఇండియన్ రెడ్ క్రాస్సొసైటీ కి అందజేశారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ కోటపాటి నరసింహం నాయుడు సామాజిక సేవలలో భాగంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువకులను ఉత్తేజ పరచడం రైతులు గల్ఫ్ కార్మికులు కోసం పాటుపడుతూ మాలాంటి వారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారు ఆయు:రారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూకోటపాటికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శులు సంగం అనిల్ కుమార్, పోల్కం వేణు, ఆర్మూర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు, మందుల బాలు, న్యాయవాది ఊరే బాలయ్య, కే.రమేష్, సునీల్ పిప్పిరి, కొక్కుల విద్యాసాగర్ ,చేపూర్ రుక్మాజి ,నరేష్ వర్మ ,గడ్డం ఉదయ్ కుమార్, నక్కల చిన్నారెడ్డి పాల్గొన్నారు.

Kotapati's birthday celebrations in grand style

More articles

Latest article