- అవైనా బయట నుంచే
- జిల్లాలో ఉత్పత్తి శూన్యం
- నేడు చేప పిల్లల పంపిణీ
నిజామాబాద్ బతుకమ్మ : వానలు కురిసిన కొన్ని రోజుల్లోనే చెరువులలో చేపలు వేయాల్సి ఉంటుంది . సుమారు రెండు నెలలు ఆలస్యం కావడంతో పెరుగుదలపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారిని దృష్టిలో పెట్టుకొని జిల్లా మత్స్య శాఖ 967 చెరువులలో రూ.4.54 కోట్ల నిధులతో చేప పిల్లలను వదలాలని ప్రతిపాదనలు సిద్దం చేసింది. సంబందిత అధికారుల అలసత్వం వల్ల వీరు రూపొందించిన ప్రతిపాదనలు సగానికి పడిపోయాయి. ఇందులోనూ చెరువులో వేసిన చేప పిల్లలు ఎన్ని బ్రతకగాలవో ఉహించని పరిస్థితి కార్మికులలో నెలకొంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 24 వేల మంది మత్స్యకారులు 396 చెరువులలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. దీనికి గాను 2024-25 సంవత్సరానికి రెండు కోట్ల 27 లక్షల చేప పిల్లలను వదలడానికి సన్నాహాలు చేసారు. 814 చెరువులలో 135 లక్షల 35 నుంచి 40 ఎం.ఎం సైజు గల చేప పిల్లలను మరియు 153 చెరువులలో రూ. 91 లక్షల 80 నుంచి 100 ఎంఎం సైజు గల చేప పిల్లలను మత్స్య అభివృద్ధి పథకం కింద వంద శాతం సబ్సిడీతో విడుదల చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. జిల్లలో 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. నాణ్యతను సక్రమంగా చూసుకొని లెక్కించి ఆయా చెరువులకు ఎంత మేరకు చేప పిల్లలు మంజూరు చేయబడ్డాయో గమనించి సైజు చూసుకున్న తర్వాత చెరువులలో వేసుకొనవల్సి ఉంటుంది. 6 నుంచి 8 నెలలు నీరు నిలువ ఉండు చెరువులలో 35 నుంచి 40 ఎం ఎం సైజు గల చేప పిల్లలు వదలడం జరుగుతుంది. ఇందులో 35 శాతం కట్ల 35 శాతం రోహు, ౩౦ శాతం బంగారు తీగ చేప పిల్లలు నిష్పత్తి ప్రకారం వదిలేటప్పుడు కమిటీ వారు సరిచూసుకోవాలని సూచించారు .నీరు శాశ్వతంగా ఉండే చెరువులలో, రిజర్వాయర్లో 80 నుండి 100 ఎంఎం పరిమాణం గల చేప పిల్లలు వదలడం జరుగుతుంది. వీటిలో 40 శాతం బొచ్చే, 50 శాతం రోహు 10 మృగాల చేప పిల్లలు నిష్పత్తి ప్రకారం వదలాల్సి ఉంటుంది. 80 నుంచి 100 ఎంఎం గల చేప పిల్లలు తూకం వేసినప్పుడు పిల్లల సంఖ్య కిలోకు 250 నుంచి 300కు మించకుండ ఎంత వస్తున్నాయో సరి చూసుకొని వదలాలి. ఈ ప్రక్రియ మూడు రకాల కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరుగుతుంది. రిజర్వాయర్లో చేపలు వదులుతున్నప్పుడుజిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా ఇరిగేషన్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు వారి నామిని గాని సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి గాని వీరితో పాటు పదిమంది లైసెన్స్ దారులు తప్పకుండా హాజరు కావాలి. నాణ్యతను సక్రమంగా చూసుకొంటునే, ఆయా చెరువులకు మంజూరు చేయబడిన చేప పిల్లలు వదులుతున్నారా లేదా అని జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. చేప పిల్లల సైజుని స్కేలుపై కొలిచి నిర్ధారించుకోవాలని, చేప పిల్లలు చలాకి గా ఉన్నాయో లేదో గమనించాలని, చేప పిల్లలను వదిలే సమయంలో ఆయా సంఘాల సభ్యులు తప్పనిసరిగా ఉండి అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పంపిణి విషయంలో తేడాలు ఉన్నట్లుంటే వెంటనే జిల్లా మత్స్యశాఖ అధికారులకు లేదా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.
