24 C
Hyderabad
Sunday, August 2, 2026

నిరుపేద దంపతులకు ఆర్థిక సహాయం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భీమ్ గల్ : భీంగల్ పట్టణం లోని బోయిగల్లిలో నివసిస్తున్న చిన్నయ్యాలక్ష్మి దంపతులకు తినడానికి తిండి లేక హాస్పిటల్ ఖర్చులకు డబ్బులేక వున్నారని తెలిసి శ్రీ భారతీ విద్యాలయం 2001-02 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆ నిరుపేద కుటుంబానికి ఆదివారం రూ.7500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు .ఈ సందర్బంగా ఆ పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ దంపతుల అవసరాలు, హాస్పిటల్ ఖర్చుల కోసం తమకు తోచినంత సహాయం చెయ్యడం జరిగిందన్నారు.మా 2001-02 బ్యాచ్ ఇప్పటికే చాలా మందికి ఈవిధంగా సహాయం చెయ్యడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ లో కూడా మాకు తోచినంత సహాయం చెయ్యడానికి ముందుంతామని తెలిపారు.సహాయం అందించిన పూర్వ విద్యార్థులు బోదిరే సుమన్, సురేష్,ఆరీఫ్,నర్సింగ్ రావు,బండి శ్రీనివాస్,సుమలత,స్వరూప,నీరజ,సునీత,గంగస్వామి,రాము,మహేష్,స్వామి,కృష్ణ,హరికృష్ణ,ప్రవీణ్,శ్రీను,సాయిలు,తుకారాం,మోహన్ లు ఉన్నారు.

More articles

Latest article