29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చిన్నారుల హత్య కేసులో తల్లీకొడుకులకు యావజ్జీవ శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

  • ఒకే కుంటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో తొలి తీర్పు
  • నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత తీర్పు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని విడివిడిగా హత్య చేసిన కేసులలో తొలి తీర్పు వెలువడింది. నిజామాబాద్ జిల్లా  మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్ బ్రిడ్జి గోదావరి నది నీళ్లలో శవాలై తేలిన ఎనిమిదేళ్ళ కవల పిల్లల హత్యకేసులలో నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల మంగళవారం రెండు తీర్పులు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రాజేశ్వర్ రెడ్డి వెల్లడించిన వివరాలు ప్రకారం మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన రచ్చర్ల పూన ప్రసాద్,మెడీదా ప్రశాంత్ మంచి స్నేహితులు. బతుకు తెరువు కోసం పరాయి దేశానికి పోయి తిరిగి స్వదేశానికి చేరుకున్న కొద్ది రోజులకే మాక్లూర్ పోలీసులు ప్రసాద్ ను ఒక ఆత్మహత్య కేసులో అరెస్టు చేశారు. ప్రసాద్ వేరే దేశంలో ఉన్న సమయంలో అరెస్ట్ అయిన సందర్భంలో ప్రశాంత్ అతని కుటుంబానికి అండదండగా ఉండేవాడు. ప్రశాంత్ టిప్పర్ కొనుగోలు చేశాడు. టిప్పర్ తో నష్టాలే తప్ప లాభాలు రాక నష్టాలు రావడంతో ప్రసాద్ వద్ద మూడున్నర లక్షల అప్పు చేశాడు. అప్పు తీర్చమని ప్రసాద్ ఒత్తిడి చేయసాగాడు. దీనికి తోడు ప్రసాద్ కు అప్పులు ఉండేవి. ప్రసాద్ పేరున ఉన్న ఇళ్లు, వాళ్ళ అమ్మ పేరున గల ఖాళీ స్థలం తన పేరున రిజిస్ట్రేషన్ చేస్తే బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుందని ప్రశాంత్ నమ్మించడంతో  ప్రసాద్ సరేనని రిజిస్ట్రేషన్ చేయించాడు. మూడున్నర లక్షల అప్పు, తన  పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన  ప్రసాద్ కు సంబంధించిన ఇళ్ళు, ఖాళీ స్థలం కొల్లగ్గొట్టడానికి ప్రసాద్ కుటుంబాన్ని బౌతికంగా లేకుండా చేయాలని కుట్ర పన్నాడు. ప్రసాద్ ను మాక్లూర్ మండలంలోని మదనపల్లె అటవీ ప్రాంతంలో,ప్రసాద్ భార్య రమణి ని , చెల్లెల్లు శ్రావణి,స్వప్న వివిధ ప్రాంతాల్లో తన స్నేహితులు విష్ణు, వంశీ లతో కలిసి హత్య చేశారు. ప్రసాద్ ఇద్దరు కవల పిల్లలు కూతురు  చైత్రిక,కుమారుడు చైత్రిక్ ను 4 డిసెంబర్ 2023 న అమ్మ నాన్నల దగ్గరకు వెళ్దామని నమ్మించి కారులో వెళుతుండగా కారులోనే చైత్రిక మెడ చెట్టు తాడు వేసి బలంగా గుంజి హత్య చేయగా,  ప్రశాంత్ తమ్ముడు పదిహేను సంవత్సరాల బాలుడు  చైత్రిక్ మెడ చుట్టూ తాడుతో బలంగా గుంజి  హత్య చేశారు. రెండు శవాలను వేర్వేరు ప్లాస్టిక్ బర్దాన్ సంచిలో ఇటుకలు వేసి  కారులో తీసుకువెళ్లి పోచంపాడ్ దగ్గరలో గల సోన్ బ్రిడ్జి పై నుండి గోదావరి నది లోని నీళ్లలో పడవేశారు. హత్యలకు తల్లి ఒడ్డెమ్మ సహకరించారు. శవాలు కుళ్ళిపోయి కనబడటంతో స్థానిక గ్రామ అధికారుల పిర్యాదు మేరకు హత్య శోధించిన మెండోరా పోలీస్ స్టేషన్ సర్కిల్ పోలీసులు నేర విచారణ పూర్తి చేసి అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేశారు. అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణ జరిపిన నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత ప్రధాన  నిందితుడు ప్రశాంత్ కు ,అతని తల్లికి ఒడ్డెమ్మలకు జీవిత కారాగార శిక్ష తో పాటు సెక్షన్ 420 ప్రకారం ఏడు సంవత్సరాల కఠిన జైలు విధించారు. ప్రశాంత్ కు అదనంగా సెక్షన్ 201 సాక్ష్యాలు రూపుమాపే ప్రయత్నాలు చేసినందున ఏడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధిస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.

More articles

Latest article