- జిల్లా వైద్యాధికారి విద్య
బాన్సువాడ, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దృష్టి లోప నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని జిల్లా వైద్యాధికారి విద్య తెలిపారు. విద్యార్థుల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు నేత్ర వైద్య నిపుణులు విశాల కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి విద్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ గతేడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్‌కె) కింద రెండు విడతలు రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కంటి పరీక్షల శిబిరాలు పది రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు 150 మంది విద్యార్థులకు కంటి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరందరికి కంటి పరీక్షల అనంతరం అద్దాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిఇవో విద్య , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విక్రమ్,డాక్టర్ విజయ్ భాస్కర్, కంటి నిపుణులు మొహమ్మద్ ముజమీల్,బి. హరికిషన్ రావు,సుధాకర్,అప్తోమె ట్రిస్ట్ సంతోష్ , దినేష్ ఆర్బీఎస్‌కె సిబ్బంది పాల్గొన్నారు.
