- సినీనటి పూనమ్ కౌర్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : భారతదేశానికి పాకిస్థాన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం లో భారత సైనికులకు అండగా నిలుద్దామని సినీనటి పూనమ్ కౌర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నగరంలోని నాందేవాడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓపిక సహనంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యమన్నారు. సహనంతో ఉంటూ సైనిక దళాలకు మద్దతు తెలుపుదామని అన్నారు. ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ అమాయక భారతీయులను పొట్టన పెట్టుకోవడం బాధాకరమన్నారు. ఈ ఉగ్రవాదులను మట్టి పెట్టేందుకు భారత సైనికులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధంలో పోరాడుతున్నారని ఇటువంటి సైనికులకు మనమంతా మద్దతు తెలుపుతూ అండగా నిలవాలి అన్నారు.
- భారత సైనికుల కు నా సెల్యూట్…..
- వీరమరణం పొందిన సైనికులకు ఘన నివాళులు.
గతంలో తాను పాకిస్తాన్ దేశంలో పర్యటించి అక్కడ శివాలయంలో పూజలు చేయడం జరిగిందన్నారు. ఆనాడు పరిస్థితికి వేరుగా ఉండేదని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందన్నారు. యుద్ధానికి ముందు జమ్ము కాశ్మీర్ లోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లవలసి ఉండగా, తన పర్యటన అని వారి కారణాల రద్దు అయిందని, ఆ మర్నాడు యుద్ధం ప్రారంభమైంది చెప్పారు. తాను వెళ్ళాక యుద్ధం వస్తే తన పరిస్థితి అక్కడ వేరుగా ఉండేదని, తన స్నేహితురాలు ఇంటి పైనుండే రాకెట్లు వెళ్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ఐశ్వర్య నాందేవాడ సెంటర్ నిర్వాహకురాలు సునీత బహేంజీ, జ్యోతి బహింజి, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
