భారత సైనికులకు అండగా నిలుద్దాం

సినీనటి పూనమ్ కౌర్   బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : భారతదేశానికి పాకిస్థాన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం లో భారత సైనికులకు అండగా నిలుద్దామని సినీనటి పూనమ్ కౌర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నగరంలోని నాందేవాడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓపిక సహనంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యమన్నారు. సహనంతో ఉంటూ సైనిక దళాలకు మద్దతు తెలుపుదామని అన్నారు. ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ అమాయక భారతీయులను పొట్టన...