27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ తల్లిని కాపాడుకుందాం

Must read

📰 Generate e-Paper Clip

. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది

. బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించుకోలేం

. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిది

హైదరాబాద్, బతుకమ్మ : ఉద్యమకారులు, కవులు, కళాకారులు కలిసి రూపమిచ్చిన తెలంగాణ తల్లిని కాపాడుకుందామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఎన్ ఆర్ ఐ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులతో కవిత మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఈ చర్యను తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలను, పండుగలను అవమానించారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి అందరి అమ్మ వంటిదని, ఆ తల్లిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు పోషించిన పాత్రను మరవలేమని అన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవహేళనలకు గురైనా కూడా తెలంగాణ తల్లి మనలో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి ఉద్యమ కారులు, కవులు, కళాకారులు కలిసి రూపం ఇచ్చారని, అటువంటి తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ తెలంగాణ తల్లి కోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.  బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతగానో కృషి చేశారని ఎన్నారైలు అన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లిని రక్షించుకునే క్రమంలో తమ వంతు సాయం చేస్తామని స్పష్టం చేశారు.  ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం,  జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, వివిధ దేశాల బీఆర్ఎస్, జాగృతి నాయకులు జ్యోతి ముద్దం, నవీన్ రెడ్డి, నాగెందర్ రెడ్డి, సుమన్ బల్మూరి, నాగరాజు గుర్రాల, కల్యాణ్ కాసుగంటి, నందిని, అనిల్ శ్రీకర్, శేఖర్, కిశోర్, ప్రభాకర్, సంపత్, రవి దన్నపునేని, హరి ప్రసాద్, శ్వేత, ఆదర్శ, సుకృతి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article