27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: వరంగల్‌లో ఈ నెల 27న జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బుధవారం మండల కేంద్రంలోని భారాస పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి బాల్కొండ శాసన సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేర భారాస పార్టీ రజతోత్సవ   బహిరంగ సభను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పూర్ణా నందం మాట్లాడుతూ 25 ఏండ్ల బీఆర్‌ఎస్‌ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్ఫూర్తి కలిగించేలా జరుగనుందని చెప్పారు. కాంగ్రెస్‌ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, కేసీఆర్‌ ప్రాధాన్యత, బీఆర్‌ఎస్‌ అవసరం ప్రజలకు తక్కువ సమయంలోనే తెలిసి వచ్చిందని వివరించారు. మండల పరిధిలోని గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ జెండాని ఆవిష్కరించి సభకు హాజరై విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తాళ్ల రాంపూర్ సొసైటీ అధ్యక్షుడు పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి,ఏర్గట్ల సొసైటీ అధ్యక్షుడు బర్మ నరసయ్య,బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేవుడు నరసయ్య, బాలాజీ గౌడ్ , కటకం సాగర్ రెడ్డి, భాను ప్రసాద్ , మాజీ ఎంపీటీసీ తోర్థి గంగాధర్, గడ్డం రమేష్,బద్దం ప్రభాకర్,బద్దం హనుమాడ్లు, బిఆర్ఎస్ యూత్ నాయకుడు రొక్కెడ మోహన్,ఏలేటి బాలకిషన్,అట్ల పోచయ్య, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉపాధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article