రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత భవన కార్యాలయంలో కొంతమంది అధికారులు సమయపాలనా పాటించడం లేదని వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు వాపోతున్నారు. సమయం 11:15 దాటినా కూడా అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అధికారులు సమయానికి రాకపోవడంతో ప్రజలు అధికారుల కోసం వేచి చూసి చూసి విసుగ్గు చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
