27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కామ్రేడ్ రవన్నస్ఫూర్తిని కొనసాగిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : అజ్ఞాత సూర్యుడు ప్రజాపంథా యోధుడు.. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) స్ఫూర్తిని కొనసాగిద్దమని, బలమైన విప్లవొద్యమాలను నిర్మించి ఆయన ఆశయాలను పరిపూర్తి చేద్దామని సీపీఐ(ఎం. ఎల్.) మాస్ లైన్ (ప్రజాపంథా) కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో కామ్రేడ్. రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న)తొమ్మిదో వర్ధంతి ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ప్రకాష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  1969 లో డిగ్రీ చదువు ను వదిలి రాయల సుభాష్ చంద్రబోస్ ఎస్. ఎఫ్ లో కామ్రేడ్ బత్తుల వెంకటేశ్వరరావు తో పనిచేస్తూ ఆ తర్వాత 1970… 72 ప్రాంతం నాటికి రాష్ట్ర జీవితంలోకి వెళ్ళాడని తెలిపారు. 50 సంవత్సరాలు పాటు రాష్ట్ర జీవితం గడుపుతూనే 2016 మార్చి 9న బ్రెయిన్ స్ట్రోక్ గురై అమరులయ్యారని పేర్కొన్నారు. పార్టీలో 1980 నుంచి కామ్రేడ్ డీవీకే. వి.వి. రవన్నలు కలిసి అతివాద, అవకాశవాదులకు వ్యతిరేకంగా అంతర్గత పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ప్రకాష్, సురేష్, కిషోర్ ,మండల నాయకులు గోపాల్ ,వెంకట్, నరసవ్వ కల్పన. తదితరులు పాల్గొన్నారు.

Let's continue the spirit of Comrade Ravanna

More articles

Latest article