- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బావితరాల భవిష్యత్ కు కాలుష్యరహిత సమాజాన్ని నిర్మిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సారంగాపూర్ అర్బన్ పార్కులో అటవీశాఖ అధికారులు నిర్వహించిన 76వ వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని అన్నారు. మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత అవశ్యకం అని అటువంటి పర్యావరణం మొత్తం నేడు కాలుష్యం అవుతుందని అన్నారు. హిందూ సంస్కృతి ప్రకారం సౌర శక్తిని సూర్యదేవునిగా, జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని ఔషాద గుణం ఉన్న చెట్లు అరటి, రావి, తులసి, మర్రి, మామిడి, వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకొని పూజించేవాళ్ళం అని కానీ నేడు వాటిని పూజించడానికి గుడికి వెళ్ళసిన పరిస్థితి ఉందని అన్నారు.

కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు RSS వంటి సంస్థలు పెరుగుతున్న జనాభా, తరుగుతున్నా ఉత్పాదకత మానవ జాతి మనుగడకే ప్రమాదం అని దీని ప్రభావం పర్యావరణం పై పడుతుందని 2018 సంవత్సరం ఆగస్టు 15 నుండి 22 వరకు దేశ రాజధాని ఢిల్లీలో 10 లక్షలకు పైగ నీడనిచ్చే, ఔషాద మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అమ్మ పేరు మీద మొక్క నాటలని పిలుపునివ్వడం జరిగిందని, పట్టణాలలో నానాటికి కాలుష్యం పెరిగిపోతుందని భవిష్యత్ తరాల మన పిల్లలు బాగుండాలన్నా కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలన్న మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అనేది చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. అడవులను కాపాడుకోవలిసిన బాధ్యత, చెట్లను పెంచే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకున్న రోజే మనం ఈ కాలుష్యన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోగాలుగుతామని బావి తరాలకు కాలుష్యం రహిత సమాజాన్ని అందించగలుగుతాం అన్నారు. ఈ 76వ వన మహోత్సవం సందర్బంగా అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని వాటి సంరక్షనను ఒక ఉద్యమంల చేపట్టి పర్యావరణాన్ని కాపాడలని పిలుపునిచ్చారు. ధర్మో రక్షతి రక్షిత: అన్నట్లు వృక్షో రక్షతి రక్షిత : అంటే వృక్షన్ని మనము కాపాడితే వృక్షాలు మనల్ని కాపాడుతాయని తెలియజేసారు. అనంతరం పాఠశాల విద్యార్థులు, అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ సుధాకర్, ఎఫ్ఆర్ఓ సంజయ్, ఎఫ్ఆర్ఓ రవిమోహన్, ఎఫ్ఆర్ఓ రాధికా, గ్రీన్ జనార్దన్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ, పుట్ట వీరేందర్, ఆనంద్, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

