26.2 C
Hyderabad
Monday, August 3, 2026

న్యాయవాదుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేద్దాం

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ బార్ అస్సోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ టికెట్స్ ధరను వంద రూపాయల నుండి రెండు వందల రూపాయలకు పెంచడం జరిగిందని నిజామాబాద్ బార్ అస్సోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి తెలిపారు.హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలోని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. పెంచిన ధరలు జూన్ 9 నుండి అమలులోకి రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం న్యాయవాదుల రిటైర్మెంట్ బెనిఫిట్, ఒకవేళ మరణిస్తే మరణాంతర బె నిఫిట్స్ ఆరు లక్షల నుండి ఇరవై లక్షలకు పెంచాలని కోరినట్లు తెలిపారు. బార్ కార్యాలయ మెంటనేన్స్ కు ఐదు లక్షలు, యువ న్యాయవాదులకు నెలవారీగా ఐదు వేల స్టయిఫండ్, హెల్త్ కార్డులలో న్యాయవాదుల తల్లితండ్రుల పేర్లు చేర్చాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. న్యాయవాదుల రిక్రీయేషన్ భవనానికి స్థలం కేటాయించెవిదంగా కృషి చేయాలని కోరినట్లు తెలియజేశారు. మెడికల్ క్లయిమ్ రీ ఎంబర్స్ మెంట్ పెంచాలని, కార్ఫాస్ ఫండ్ ప్రతి ఆర్థిక సంవత్సరం ఇవ్వాలని విన్నవించినట్లు సాయరెడ్డి చెప్పారు.బార్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి నాగలక్ష్మి తో కలిసి నూతన అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ టికెట్స్ ను ఆవిష్కరించినట్లు తెలిపారు.

More articles

Latest article