- విద్యార్థులను సత్కరించిన ఎంఈఓ
బతుకమ్మ, కోటగిరి : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ఎంపికైన విద్యార్థులను శుక్రవారం స్థానిక ఎంఈఓ శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన చరణ్, అంజలి, శ్వేత, అన్వేష్, ప్రణీత్ కుమార్, శ్రావణి అనే ఆరుగురు విద్యార్థులు ఇటీవల నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించే స్కాలర్షిప్ కు అర్హత సాధించారని ఆయన తెలిపారు. ఒక్కరికి ఏటా 12000 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలకు 48000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో లభిస్తాయని ఆయన తెలిపారు. అనంతరం మెరిట్ సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చిన ఆరుగురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.
