ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దాం
ప్రజా పంథా ష్ట్ర నాయకులు పి రామకృష్ణ సిరికొండ, బతుకమ్మ కామ్రేడ్ పిట్ల ఎల్లన్న స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి రామకృష్ణ పిలుపు ఇచ్చారు. మంగళవారం అమరుడు పిట్ల. ఎల్లన్న స్వగ్రామం మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ, వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అతివాదం తలకెక్కిన పీపుల్స్ వార్ ఆనాడు పిరికితనం తో దొంగ చాటుగా నిరాయుధుడు...