29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

లోలం బ్రిడ్జి వద్ద చిరుత సంచారం

Must read

📰 Generate e-Paper Clip

 

 . . . ఆందోళనలో అయా గ్రామాల ప్రజలు

 ఇందల్వాయి, బతుకమ్మ:

ఇందల్వాయి మండలం లోలం- మల్లాపూర్ బ్రిడ్జి వద్ద చిరుత సంచారం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. శుక్రవారం రాత్రి ధర్పల్లి కి చెందిన కొందరు లోలం బ్రిడ్జి వద్ద చూసి భయాందోళనకు గురయ్యారు. డిచ్ పల్లి- మిట్టపల్లి  నుంచి లోలం- ఎల్లారెడ్డి పల్లె వైపు వచ్చేవారు రాత్రివేళ బ్రిడ్జి వద్ద జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. లోలం బ్రిడ్జి వద్ధ చిరుత సంచారం వాస్తవమేనని ఇందల్వాయి రేంజ్ అటవీ అధికారి రవి మోహన్ భట్ తెలిపారు. శనివారం ఉదయం ఆటవి శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు అన్నారు. ఇటివల ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి శివారులో సంచరించిన చిరుత నే స్థానికంగా తిరుగుతుందని అనుమానిస్తున్నారు.

 

More articles

Latest article