26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసన సభ ఆమోదం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. ఈమేరకు సురవరం యూనివర్సిటీగా పేరు మారనుంది. తెలంగాణ అసెంబ్లీలో 5 కీలక బిల్లులను సోమవారం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టగా, బీసీ రిజర్వేషన్‌ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టారు. అలాగే విద్య, ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పిస్తూ బిల్లు,  స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది.

More articles

Latest article