బతుకమ్మ, నందిపేట్ : ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందిపేట్ బి ఆర్ ఎస్ నాయకులు గురువారం నందిపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో రాకేష్ రెడ్డి “హిందువులు నపుంసకులు, చేతకాని దద్దమ్మలు, చెత్త నా కొడుకులు” అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారని, ఈ వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ మతపర వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర మంతట అశాంతి వాతావరణం నెలకొని, భవిష్యత్తులో శాంతి భద్రతలకు ముప్పు కలుగుతుందని ఆరోపించారు. ఈ పరిస్థితిని కట్టడి చేసేందుకు రాకేష్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బి ఆర్ ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, వెల్మల్ రాజన్న, బాలగంగాధర్, సురేందర్ తదితరులు వున్నారు.
