27.3 C
Hyderabad
Friday, July 31, 2026

దీక్షా దివస్ కు తరలిన నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ శుక్రవారం జిల్లాలో దీక్ష దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుబారాస మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్ తెలిపారు‌. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం నవంబర్ 29 అన్నారు. ఈ సందర్భంగా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించే విధంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.
దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు, ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ చారిత్రక సంఘటనలు తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ ముఖ్య నాయకులు క్యాడర్ కి వివరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బారాస మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, డాక్టర్ రాజు, నల్చర్ శ్రీనివాస్, సయ్యద్ అన్వర్, మిషన్ కల్లాలి మాజీ సర్పంచ్ సంజు మరియు బారాస నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article