24.7 C
Hyderabad

అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను సన్మానించిన న్యాయవాదులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇటీవల నియమితులై  బాధ్యత చేపట్టిన ఆర్ సోమ లింగా గౌడ్ ను న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూల మొక్కలు అందజేసి ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ  బాధిత ప్రజలకు  త్వరితగతలు న్యాయ సేవలందించింది అందించేందుకు కృషి చేయాలని  కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది అముదాల సుదర్శన్,  పరిషత్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్, వినోద్ కుమార్, శంకర్, గంగాధర్,  జె .వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article