ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శుక్రవారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 498(ఏ) ఐపీసీ కేసులో హనుమాన్ నాయక్, అనిల్ కుమార్ అనే ఇద్దరు న్యాయవాదులపై భార్య వైపు బంధువులు దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ రావు నేతృత్వంలో న్యాయవాదుల అత్యవసర సమావేశం నిర్వహించి. కోర్టు పనులు మానుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి, నిర్ణయం తీసుకున్నారు.
ఈకార్యక్రమంలో న్యాయవాదులు సతీష్, శ్రీకాంత్, నావిద్, పద్మ పండరి, సాయి ప్రకాష్ దేశ్ పాండే, నాగం సాయిబాబా నామ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులు దాడి ఘటనను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ
