న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శుక్రవారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 498(ఏ) ఐపీసీ కేసులో హనుమాన్ నాయక్, అనిల్ కుమార్ అనే ఇద్దరు న్యాయవాదులపై భార్య వైపు బంధువులు దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ రావు నేతృత్వంలో న్యాయవాదుల అత్యవసర సమావేశం నిర్వహించి. కోర్టు పనులు మానుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి, నిర్ణయం తీసుకున్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు సతీష్, శ్రీకాంత్, నావిద్, పద్మ పండరి,...