న్యాయవాది స్వప్న హత్య హేయమైన చర్య

0 8,185

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో పని చేస్తున్న మహిళా యువ న్యాయవాది స్వప్న దారుణ హత్య ఘటనను జిల్లా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. స్వప్న హత్య సమాజంలో హేయమైన చర్యగా భావిస్తున్నామని న్యాయవాదులపై, ముఖ్యంగా మహిళా న్యాయవాదులపై, జరుగుతున్న ఇటువంటి హింసాత్మక దాడులు నాగరిక సమాజంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధ్యులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాజ సేవకు పనిచేస్తున్న న్యాయవాదులపై ఇటీవలి కాలంలో జరుగుతున్న అమానుష దాడులు, హత్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వం మేల్కొని న్యాయవాదుల భద్రతకు హామీ ఇచ్చే ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదుల దాడులు న్యాయవ్యవస్థకు వెన్నెముకైన న్యాయవాదుల మనుగడ ప్రజాస్వామ్య వ్యవస్థే  ప్రమాదంలో పడుతుందని, ప్రభుత్వం న్యాయవాదులపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి తక్షణమే న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.