న్యాయవాది స్వప్న హత్య హేయమైన చర్య

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో పని చేస్తున్న మహిళా యువ న్యాయవాది స్వప్న దారుణ హత్య ఘటనను జిల్లా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. స్వప్న హత్య సమాజంలో హేయమైన చర్యగా భావిస్తున్నామని న్యాయవాదులపై, ముఖ్యంగా మహిళా న్యాయవాదులపై, జరుగుతున్న ఇటువంటి హింసాత్మక దాడులు నాగరిక సమాజంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, బాధిత...