నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జాతీయ బీసీ యువజన సంఘం నిజామాబాద్ నగర అధ్యక్షునిగా బట్టు సాయి ప్రసాద్ రాజుని నియమించినట్టు జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు తెలిపారు. ఈ మేరకు జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్యామ్ బాబు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని గీత భవనంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ బొబ్బిలి నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై, సాయి ప్రసాద్ రాజుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి నర్సయ్య, నాగరాజు, శ్యాం బాబు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ నియామకం చేసినట్టు తెలిపారు. బీసీవాదాన్ని బలపర్చేందుకు కృషి చేయాలని సూచించారు. నగరంలో నూతన కమిటీలు వేసి, సంఘ నిర్మాణం చేయాలని మార్గ నిర్దేశం చేశారు. స్వచ్ఛందంగా బీసీ సంఘంలో చేరిన అందరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్, బీసీ జేఏసీ కో చైర్మన్లు ఎండల ప్రదీప్, కరిపే గణేష్, తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్, బీసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.