29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పేదల భూముల సమస్యలను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర మంత్రి సీతక్కకు రైతు, కూలి సంఘాల నేతల వినతి

 

సిరికొండ, బతుకమ్మ : పేదలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమి సాగును అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని అట్టి పేదల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భాధితులతో కలిసి అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏ ఐ యు కె ఎస్) నాయకులు జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్కకు వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం  మండలం లోని పాకాలలో   రాష్ట్ర మంత్రి సీతక్కను కలసి వినతి పత్రం అందజేశారు. మండలంలోని సిరికొండ, గడ్కోల్, హుస్సేన్ నగర్, తూంపల్లి గ్రామాల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టా భూముల్లో కెసిఆర్ ప్రభుత్వం వచ్చినాక సాగును అడ్డుకుంటున్నారని,  ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ను అరికట్టాలని కోరారు. సిరికొండలో సర్వే నంబర్ 532,గడ్కోల్ సర్వే నంబర్ 100 తుంపల్లి గ్రామాల్లో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, హుస్సేన్ నగర్ గ్రామ పరిదిలోని ప్రభుత్వ భూమి (ల్యాండ్ లార్డ్ జాగీర్దార్ సైదర్ జంగ్ ద్వారా సీలింగ్ ప్రభుత్వ భూమిగా )సర్వే నెం: 836లో ఎస్సీ, బీసీ, మైనారిటీలకు చెందిన 70 మంది వ్యవసాయ కూలీలు 2001సంవత్సరం నుండి సుమారుగా 140ఎకరాలు సాగుచేసుకుంటున్న భూమికి పట్టాలు ఇవ్వాలని కోరారు. 2004 సంవత్సరంలో భూపంపిణి కార్యక్రమంలో భాగంగా గడ్కోల్, సిరికొండ పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని,  ఇట్టి భూములు ఆనాటి నుండి సాగు చేస్తున్న పేదల భూముల్లో కెసిఆర్ ప్రభుత్వం  2018 లో అక్రమంగా కంధకాలు తవ్వడం, సాగును అడ్డుకోవడం జరుగుతుందన్నారు. ఇట్టి భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం లో సీ ఎల్ డీ పీ స్కీమ్ ద్వారా డెవలప్మెంట్ చేసి పేదలకు ఇవ్వాలని వారు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారం లో వచ్చిన వెంటనే సాగు, పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తమని హమీ ఇచ్చారని, ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న పరిష్కారం దొరకడం లేదన్నారు.  గడ్కోల్ సిరికొండ గ్రామల్లో రెవిన్యూ పట్టా భూములలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలని, సాగు అడ్డకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ, బీసీ, మైనారిటీ పరిధిలో గల ప్రభుత్వ భూమి సర్వే నెం: 836లో 285 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి కలదు. ఇందులో నుండి సుమారుగా 140ఎకరాలను మేము గత 24సంవత్సరాలనుండి అడవి ఆముదం,సొయా,పజ్జోన్న తదితర అరుతడి పంటలను సాగు చేసుకుంటున్నామని అందులో SC మాదిగలు 32 మంది, మాల కులానికి చెందిన 03,  బీసీ కులాలకు చెందిన గొల్ల, ముదిరాజ్ లు, మైనారిటీ లు 35 మంది మొత్తం 70 కుటుంబాలు సాగు చెసుకుంటున్నా యన్నారన్నారు.  ఇట్టి భూమి గతంలో మా గ్రామ జగిర్దార్ సైదార్ జంగ్ తండ్రి యూసుఫ్ అలీ అనే జగిర్ధార్ కుటుంబం నుండి సుమారు వెయ్యి ఎకరాలు సీలింగ్ ద్వారా ప్రభుత్వం తీసుకొని పేదలకు ఇచ్చిందని తెలిపారు.మిగతా సర్వే నంబర్ 836 సాగుచేస్తున్నపేదలకుపట్టాలురాలేదని తెలిపారు.కానీ2018 ధరణి వచ్చిన నుండి సైదర్జంగ్కు చెందిన వారసుల మని పైరవిలు చేస్తూ మా భూములు “కా “చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.కొంత మంది డబ్బులు పోగు చెసుకొని నకిలీ వ్యక్తిని పెట్టి ఈ భూమిని కొట్టేయ్యాలని,కొంతమంది లక్షల డబ్బులను హైదరాబాద్ లో పైరవీలు నడు పుతున్నారన్నారు. గతంలో కూడా ఇదే సిరికొండ మండలం లోని పొలిమేర లో గల రామడుగు గ్రామంలో ఇలాగే ఇదే జాగీర్ధార్ వారసులమని ఆ గ్రామానికి చెందిన భూములను కబ్జా చేసి పట్టాలు పొందాలని ప్రయత్నాలు చేయగా సీపీఐ(ఎం. ఎల్) ప్రజాపంథా పార్టీ ఉద్యమం, గ్రామస్తుల పోరాటం తో, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడంతో బినామీ వ్యక్తుల పై గల రిజిస్ట్రేషన్ ను రద్దు చెసి అదే గ్రామనికి చెందేలాగా చేసి అక్కడి వారికి న్యాయం చేశారన్నారు. దశబ్దాల కాలంగా పహాణి నకల్ లో ప్రభుత్వ భూమిగా రికార్డ్ చేశారన్నారు. ప్రభుత్వ భూమి పేదలకు దక్కే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.ఇప్పటి కైన ప్రభుత్వం మానవతా దృక్పధంతో అలోచించి గత 24 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్న హుస్సేన్ నగర్ గ్రామ ఎస్సీ, బీసీ, మైనార్టీ నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలి అని వారు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article