29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

హెడ్మాస్టర్ సొంత ఖాతాలో రూ.3లక్షలు..

Must read

📰 Generate e-Paper Clip

  • ముగ్గురు టీచర్ల ఖాతాలో రూ.3లక్షలు
  • చందూర్ జెడ్ పి హెచ్ ఎస్ పిఎంశ్రీ నిధుల దారి మల్లింపుపై ఫిర్యాదులు
  • విచారణ చేపట్టిన విద్యాశాఖాధికారులు

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా పథకం నిధులను ప్రభుత్వ ఉపాధ్యాయులే  పక్కదారి పట్టిస్తున్నారు. సంబంధిత పీయంశ్రీ నిధులను ఖర్చు చేయకుండా సొంత ఖాతాలలో జమ చేసుకున్నటు వంటి వ్యవహారంపై సంబంధిత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది నాలుగు నెలల క్రితం జిల్లా విద్యాశాఖాధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా దానిపై విచారణ జరుపుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 50 పాఠశాలలు పియంశ్రీపథకం కింద ఎంపికయ్యాయి. ఇటీవల సంబంధిత నిధుల వినియోగంలో దుర్వినియోగంతో పాటు నిధులు పక్కదారి పట్టినట్టు తెలియడంతో ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 18న విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు పీయంశ్రీ పథకం గురించి ఆరా తీయగా గురువారం నిజామాబాద్ జిల్లా చందూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాశాఖాదికారి ఆదేశాల మేరకు విచారణ జరుపడం విశేషం.

The headmaster has Rs. 3 lakhs in his own account.

చందూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు 2024-25 విద్యా సంవత్సరంలో పిఎంశ్రీ కింద రూ.17 లక్షలు నిధులు విడుదలైనవి. దాదాపు రూ.11 లక్షలు సివిల్ వర్క్స్ కు, ఒక లక్ష స్పోర్ట్స్ మెటీరియల్ కు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నాయి. మిగతా ఐదులక్షలకు గాను రూ.2 లక్షలు హెచ్ఎం సొంత అకౌంట్ లో మూడు లక్షలు ముగ్గురు సిబ్బంది సొంత అకౌంట్లో వేసుకొని పీఎంశ్రీ నిధులు ఖర్చు చేయకుండా కనీసం సమావేశం ఏర్పాటు చేసి పైసలు ఉన్నాయని తెలుపకుండా  మార్చి నుండి జూలై లోపల ఖర్చు చేయాల్సిన డబ్బులు ఖర్చు చేయకుండా ఆడిట్లో మేనేజ్ చేసుకుంటూ పిఎంశ్రీ నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ విషయంపై పాఠశాల విద్యా కమిటీతో పాటు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులే.. హెచ్ఎం, ముగ్గురు సిబ్బంది పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై గత నాలుగు నెలల క్రితం ప్రధానోపాధ్యాయులపై చర్యలు గైకొనాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఏసీబీ అధికారుల రాకతో విద్యాశాఖలో చలనం వచ్చింది.

ప్రధానోపాధ్యాయులు తన సొంత అకౌంట్లో రెండు లక్షలు, ముగ్గురు సిబ్బంది సొంత అకౌంట్లో మూడు లక్షలు ఖర్చు చేయకుండా నిల్వఉంచుకోవడం. గత సంవత్సరం పీఎంశ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం జరిగిందని ఆరోపణలపై గురువారం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినర్ బాలోజీ, సర్వ శిక్ష అభియాన్ ఏఎంఓ జీవన్ విచారణ జరిపి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖ అధికారి వీరిపై చర్యలు తీసుకుంటారు లేదా ఆర్జెడికి నివేదిక సమర్పిస్తారు. మిస్ యూస్ ఆఫ్ ఫండ్స్ కింద వీరికి తప్పకుండా చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. నాలుగు నెలల క్రితం ఫిర్యాదు వచ్చిన అధికారులలో చలనం లేకపోవడం వెనుక షరా మామూలుగా నిధుల దూర్వినియోగం అను భావన ఉన్నట్టు అర్థమౌతుంది. అదే విధంగా ఉపాధ్యాయుల మధ్య ఉన్న విభేదాలతోనే జరుగుతుందని కొందరు యూనియన్ నాయకులు విద్యాశాఖాధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. విచారణ అధికారుల నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారా లేదా అనే చర్చ జరుగుతుంది.

The headmaster has Rs. 3 lakhs in his own account.

More articles

Latest article