27.3 C
Hyderabad
Friday, July 31, 2026

లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర  కరపత్రం ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ 14న ప్రారంభమయ్యే లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల అధ్యక్షులు ఉమేష్ మహారాజ్  అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 న నిర్వహించే ఈ రథయాత్రకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ చేపట్టిన ఈ లక్ష కిలోమీటర్ల రథ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని  కోరారు. తెలంగాణలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సి, ఎస్టి అణగారిన వర్గాల ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని కలిగించి రాజ్యాధికారాన్ని స్థాపించడమే ధ్యేయంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇందూర్ రాజు, దోమకొండ రాజు,ఎస్ నర్సయ్య,ఆర్ నర్సయ్య, రాములు తదితరులు  పాల్గొన్నారు.

More articles

Latest article