27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ల్యాబ్ టెక్నిషియన్లు 11 రకాల రిజిస్టర్ లు మెయింటెన్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అన్ని రకాల ల్యాబ్ టెక్నిషియన్లు 11 రకాల రిజిస్టర్ లు మెయింటెన్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనీత వ్యాధుల నియంత్రణ విభాగంలో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు, హెల్త్ అసిస్టెంట్ లకు శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మలేరియా, ఫైలేరియా పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్ఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియా లేదా ఫైలేరియా జ్వరంతో బాధపడే వ్యక్తి వద్ద నుండి రక్తపూత నమూనాల సేకరణను సరియైన పద్ధతిలో తీసి వెంటనే జె ఎస్ బి1, జె ఎస్ బి2 రసాయనాలతో స్టేయిన్ చేయాలని అన్నారు. ముఖ్యంగా ఫైలేరియా రక్తపోతలను రాత్రిపూట జరపీడుతులు నిద్రపోయే సమయంలో సేకరించాలన్నారు. లేనిచో పారాసైట్ కనిపించదని తెలియజేశారు. అనంతరం టీ హబ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దివ్య మాట్లాడుతూ టీ హబ్ షాంపుల్స్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో తెలిపారు. హెచ్ బిఏ1సి, వైరల్ హేపటైటిస్, మధుమేహం నిర్ధారణ కై ఫాస్టింగ్ బ్లడ్ టెస్టును చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఓ డాక్టర్ వెంకటేష్, డాక్టర్ దివ్య, ఏఎమ్ఓ షేక్ సలీం, సూపర్వైజర్ కిషన్, మురళీకృష్ణ, కృష్ణమోహన్, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.

 

 

Lab technicians must maintain 11 types of registers

More articles

Latest article