24 C
Hyderabad
Sunday, August 2, 2026

కుచ్చాభూమిని సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కుచ్చాభూమిని సర్వేచేసి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఆర్డీఓకు వినతి పత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భాం వారు మాట్లాడారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గల గండిమాసానిపేట్ గ్రామ శివారులోని పందిరెనే కుచ్చ అక్రమంగా మెరం తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు.   గ్రామస్తులు చాలా సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన  పట్టించు కోకుండా చూసి చూడ నట్టుగా వెళ్లి పోతున్నారని తెలిపారు.  సర్వేనెంబర్ 478లో సుమారు 35 ఎకరాలు భూమి ఉందని,  అందులో 5 ఎకరాల భూమి 133 కేవీ సబ్ స్టేషన్ కు కేటాయించారని తెలిపారు. కొంత భూమి ఆసెన్డ్ పట్టాలు ఉన్నాయని తెలిపారు.  కొంత భూమిలో కొన్ని కుల సంఘాలు స్థలం లేనివారు సమాధుల కొరకు స్మశాన వాటికకు వాడుకుంటున్నారని తెలిపారు. సబ్ స్టేషన్ కు  వచ్చే కరెంటు పెద్ద లైన్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందన్నారు.  కొన్ని గ్రామాలకు కరెంటు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. ఆర్డీఓ స్పందించి సమస్య పరిష్కరిస్తామని  హామీ ఇచ్చారని తెలిపారు.

More articles

Latest article