బతుకమ్మ, బోధన్: బోధన్ ఇందుర్ ప్రైమరీ స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు గోపికల వేషధారణలో ఆకట్టుకోగా, బాలికలు కృష్ణపాటలకు చేసిన నృత్యాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. టీచర్లు రూపొందించిన బృందావనం, కారాగారం, కృష్ణుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రిన్సిపాల్ సుధారాణి కృష్ణుని ప్రాముఖ్యతను వివరించగా, ముఖ్య అతిథిగా హాజరైన ట్రాస్మా జిల్లా అధ్యక్షులు, ఇందుర్ విద్యాసంస్థల అధినేత కొడాలి కిషోర్ విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
