24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రశ్నించే గొంతుక అవుతారని కొమురయ్యను గెలిపించారు

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (తపస్)ఆధ్వర్యంలో ఉపాధ్యాయ వందన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం నగరంలోని ప్రగతి నగర్ పాటిదార్ భావన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ధన్ పాల్ మాట్లాడుతూ  ఉపాధ్యాయ సమస్యల పట్ల శాసనస మండలిలో ప్రశ్నించే గొంతుకగా  మొదటి ప్రాధాన్యతతో కొమురయ్య ను  గెలిపించిన ఘనత ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి దక్కుతుందన్నారు. మేధావులైన ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు లాంటిది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు,హామీలు తుంగలో తొక్కి మాటలతో పూట గడుపుతున్న రేవంత్ సర్కార్ కు తగిన గుణపాఠం జరిగిందన్నారు.ఈ ఎమ్మెల్సి ఎన్నికల గెలుపే రేపు తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటానికి పునాది అవుతుందన్నారు.ఈ విజయంలో కష్టపడ్డా టీపీయూఎస్సంఘ నాయకులకు,బిజెపి కాషాయ కార్యకర్తలకు,ఉపాధ్యాయులకు మేధావులందరికి పాదాభివందనం తెలియజేసారు. ఈ సందర్బంగా ఎన్నికల్లో కష్టపడి పని చేసి బిజెపిని గెలుపు దిశగా నడిపించిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, తపస్ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, కొండా ఆశన్న,రెంజర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article