ధర్పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కత్తి పొట్ల ఘటన కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఆకస్మికంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆప్రాంతంలో గందరగోళం నెలకొంది. దాస్ అనే వ్యక్తి భార్యపై అనుమానంతో ముగ్గురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భార్యతోపాటు మరో వ్యక్తికి, అతడి కూతురికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


